Mellaga Karaganee... .. , Varsham
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసంతడిపి తడిపి తనతో నడిపిహరివిల్లుని వంతెన వేసిన శుభవేళఈ వర్షం సాక్షిగా తెలపనీ నువ్వు నాకే సొంతంఈ వర్షం సాక్షిగా కలపనీ బంధంనీ మెలికెలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము
తడబడి నిను విడగా
ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైన
త్వరపడే వయసునే నిలువనీను ఇకపైన
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి రుజువని
చరితలు చదివేలా
mellaga karaganee rendu manasula duram
challaga teravanee konte talapula dwaram
valapu vana darale pamputunnadi akasham
chinuku pula haraale allutunnadi manakosam
tadipi tadipi tanato nadipi
harivilluni vantena vesina shubhavela
ee varsham sakshiga telapanee nuvu nake sontam
ee varsham sakshiga kalapanee bandham
ne melikelalona aa merupulu chustunna
ee tolakarilo talatala natyam needena
aa urumulalona ne pilupulu vintunna
ee chitapatalo chitikela talam needenaa
matichede dahamai anusarinchi vastunna
jatapade snehamai anunayinchanaa
chali pidugula sadi vini jadisina bidiyamu
tadabadi ninu vidagaa
ye teramarugaina ee choravanu apena
na paruvamu ne kanulaku kanuka istunna
ye chiru chinukaina ne sirulanu chupena
aa varununike runapadipona ee paina
twarapade vayasune niluvanenu ikapaina
vidudale vaddane mudulu veyanaa
mana kalayika chedarani chelimiki rujuvani
charitalu chadivelaa
No comments:
Post a Comment