Wednesday, 6 May 2015

kkadai Ravadam...okkadai Povadam... , Aa Naluguru



ఒక్కడై రావడం...
ఒక్కడై పోవడం...
నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళమరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీనీ బరువూ...నీ పరువూ...మోసేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...రాజనీ...పేదనీ,
మంచనీ...చెడ్డనీ...
భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యమూ...
కటిక దారిద్ర్యమూ...
హద్దులే చెరిపెనీ మరుభూమి
మూటలలోని మూలధనం...
చేయదు నేడు సహగమనం
నీ వెంట...కడకంటా...
నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
నలుగురూ మెచ్చినా...
నలుగురూ తిట్టినా...
విలువలే శిలువగా మోశావూ
అందరూ సుఖపడే...
సంఘమే కోరుతూ...
మందిలో మార్గమే వేశావూ
నలుగురు నేడు పదుగురిగా...
పదుగురు వేలు వందలుగా
నీ వెనకే...అనుచరులై ...
నడిచారూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
పోయిరా నేస్తమా...
పోయిరా ప్రియతమా...
నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యమూ...
జీవితం సత్యమూ...
చేతలే నిలుచురా చిరకాలం
బతికిన నాడు బాసటగా...
పోయిన నాడు ఊరటగా
అభిమానం...అనురాగం...
చాటేదీ....ఆ నలుగురూ...ఆ నలుగురూ...
okkadai Ravadam...
okkadai Povadam...
naduma I Natakam Vidhilila
Vemta E Bamdhamu...
rakta Sambamdhamu...
toduga Raduga Tudivela
Maranamanedi Kayamani...
migilenu Kirti Kayamani
Ni Baruvu...ni Paruvu...
mosedi...a Naluguru...a Naluguru...
rajani...pedani,
Mamcani...ceddani...
bedame Erugadi Yamapasam
Kotla Aisvaryamu...
katika Daridryamu...
haddule Ceripeni Marubumi
Mutalaloni Muladhanam...
ceyadu Nedu Sahagamanam
Ni Vemta...kadakamta...
nadicedi...a Naluguru...a Naluguru...
naluguru Meccina...
naluguru Tittina...
viluvale Siluvaga Mosavu
Amdaru Sukapade...
samgame Korutu...
mamdilo Margame Vesavu
Naluguru Nedu Paduguriga...
paduguru Velu Vamdaluga
Ni Venake...anucarulai ...
nadicaru...a Naluguru...a Naluguru...
poyira Nestama...
poyira Priyatama...
nivu Ma Gumdelo Nilicavu
Atmaye Nityamu...
jivitam Satyamu...
cetale Nilucura Cirakalam
Batikina Nadu Basataga...
poyina Nadu Urataga
Abimanam...anuragam...
catedi....a Naluguru...a Naluguru...

No comments:

Post a Comment